pawankalyan-tdp-news

పవన్ నిర్ణయంతో టీడీపీలో గుబులు





pawankalyan-tdp-news


జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీలో గుబులు మొద‌లైంద‌నే వాదనలు వినపడుతున్నాయి. టీడీపీకి కంచు కోట‌గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు ప్రాంతం లో పవన్ కళ్యాణ్ ఓటు హ‌క్కును నమోదు చేసుకోవాలి అని నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా విష‌యం దాగి ఉంద‌ని ప‌లువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ప‌వ‌న్ త‌న అభిమానుల‌తో తాను ఏలూరులో ఉండేందుకు అనువైన ఇల్లు చూడాలని ప‌వ‌న్ సూచించిన‌ట్టు పేర్కొన్న జనసేన కార్యకర్తలు ఇల్లు వెతికే పనిలో నిమ‌గ్న‌మ‌య్యారు. పవన్ ఏలూరులో ఉండాలనుకోవడం వెనుక చాలా పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. 2019 సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా పవన్ ఒంటరిగా బరిలోకి దిగితే జిల్లాలో తమకు భారీ నష్టం తప్పదని టీడీపీ నేతలు ఇప్పటి నుంచే ఆందోళ‌న చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతో పవన్ కళ్యాణ్ కీ అతని అన్నయ్య చిరంజీవి కీ కూడా సొంత ప్రాంతమే.

ఎందుకంటే అదే జిల్లాలోని మొగల్తూరు లో పుట్టి పెరిగిన చిరంజీవి అదే ప్రాంతంలో గ‌త ఎన్నిక‌ల్లో పోటీకి దిగాడు. ఇక బాపట్ల లో పుట్టి నెల్లూరు లో పెరిగాడు పవన్ కళ్యాణ్. తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగ దీత్యా బదిలీ అవ్వడంతో కళ్యాణ్ కి ఊహ తెలిసే లోగా ఈ జిల్లా నుంచి వెళ్ళిపోయారు. ఇక రాష్ట్ర‌విభ‌జ‌న త‌రువాత ప్ర‌త్యేక హోదాపై గళమెత్తిన పవన్ తొలుత తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించగా తర్వాత కాకినాడలో నిర్వ‌హించారు. కాకినాడ బ‌హిరంగ స‌భ‌లో మాత్రం సీఎం చంద్ర‌బాబునాయుడుని ఏమి అన‌క‌పోయినా.. టీడీపీ ఎంపీల‌ను మాత్రం ఏకిపారేశాడు. ఏలూరులో ప్ర‌స్తుతం ఓటు హ‌క్కు న‌మోదు చేసుకోవాలని ఆయన భావించడం ఇందుకు కొనసాగింపేనని ప‌లువురు ఆలోచ‌న‌. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచీ పార్టీని బలోపేతం చేసేందుకే ఆయన ఏలూరును ఎంచుకున్నట్టు పవన్ సన్నిహితులు తెలియ‌జేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన కాపు ఓట్లపైన కూడా పవన్ దృష్టి పెట్టాడ‌ని స‌మాచారం.



కాపులు బలంగా ఉన్న జిల్లా పశ్చిమ జిల్లా కావడంతోనే పవన్ ఈ జిల్లాలోనే ఓటుహక్కు నమోదుకు ఆసక్తి చూపిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తనను ఓ కులానికి పరిమితం చేయడం తగదని గతంలో పవన్ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు కాపులు బలంగా ఉన్న జిల్లానే తన తదుపరి కార్యాచరణకు ఎంచుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. కాపులు ఎక్కువ‌గా ఉన్నార‌నో.. లేక సొంత జిల్లా కాబ‌ట్టే ఎంచుకున్నాడో ఇత‌ర పార్టీల‌కు తెలియ‌క అయోమ‌యంలో కొ్ట్టుమిట్టాడుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *