baahubali-hero-prabhas-to-get-married

‘ప్ర‌భాస్ పెళ్లి’ ఎప్పుడో తెలుసా .. !





baahubali-hero-prabhas-to-get-married


Baahubali hero Prabhas get married ?? :

ఈ టైటిల్‌గా చూడ‌గానే బాహుబ‌లి సినిమాలో న‌టించిన ప్ర‌భాస్ పెళ్లి చూస్తారా.. అనుకుంటున్నారా.. ఆయ‌న పెళ్లికి ఆహ్వానం రావాలే గాని ఎన్ని ప‌నుల‌యినా మానుకుని వ‌స్తాము.. అనుకుంటున్నారా.. అయితే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్టే.. ఇది యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ది కాదు. ఈపెళ్ళి బాహుబలి సినిమాలో కాలకేయగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విల‌న్ ప్రభాకర్ ది. అది కూడా సినిమా పాత్ర‌లోదే. ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన వైవిధ్య‌మైన చిత్రం ‘ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి’.. ఈ చిత్రాన్ని సూర్య‌దేవ ఫిల్మ్ కార్పొరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి, శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్పిస్తున్నారు.

న‌వంబ‌ర్ 4 న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా విడుద‌లై ప్రేక్షకుల‌కు అల‌రించ‌నుంది. ద‌ర్శ‌కుడు చైత‌న్య ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఎన్నోర‌కాల టైటిల్స్ అనుకున్నాం. కాని ఈటైటిల్ క‌థ‌కి యాప్ట్ అని ఫీల్ అయ్యి యూనిట్ అంద‌రం నిర్ణ‌యించాం. చిత్రం చూసిని త‌రువాత అంద‌రూ చాలా ఢిఫ‌రెంట్ గా కామెడీగా ఉంద‌ని కితాబిస్తార‌ని అన్నారు.


స‌హ‌జంగా తెలుగు చిత్రాల్లో హీరో గాని, హీరోయిన్ గాని ప్రేమ వైఫ‌ల్యం చెంద‌డంతో క‌థ మెద‌లవుతాయి.. ఓ విల‌న్ ప్రేమ వైఫ‌ల్యాల నుంచి క‌థ ప్రారంభం చేసిన మొట్ట‌మెద‌టి చిత్రం మా ‘ఆవు పులి ప్ర‌భాస్ పెళ్ళి’.. అందుకే దీనికి క్యాప్ష‌న్ ని కూడా ‘ఇది యధార్థ క‌థ కాదు’ అని డిసైడ్ చేశాం. ఈ చిత్రంలో నెల్లూరు లోని నిజ‌మైన రౌడీలు న‌టించారు. కొత్త త‌రం ప్రేమ‌క‌థ‌ని కొత్త త‌రం కామెడితో ఇప్ప‌టివ‌ర‌కూ రాని విధంగా చాలా చిన్న‌ బ‌డ్జెట్ లో నిర్మించాం అని చెప్పారు. ఈ చిత్రం టీజ‌ర్ కి ఆడియో కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మీరు కూడా ఈ సినిమాను చూసి ఆద‌రించండి అంటూ ద‌ర్శ‌కుడు చైత‌న్య చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *