రాజకీయ వేదికపై త్రివిక్రమ్ గురించి పవన్

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల మద్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కు అత్యంత ఆప్త మిత్రుడు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో త్రివిక్రమ్ పేరు ముందు ఉంటుంది. వీరిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒక్కటే అవ్వడం వల్ల మంచి మిత్రులు అయ్యారు. ఆ విషయం గతంలో పవన్ మరియు త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మినహా జల్సా అత్తారింటికి దారేది చిత్రం మంచి విజయాలను దక్కించుకున్నాయి. పవన్ సినిమా ఇండస్ట్రీ వదిలిన తర్వాత త్రివిక్రమ్ గురించి ఇప్పటి వరకు రాజకీయ వేదికల గురించి ఎప్పుడు కూడా ప్రస్థావించలేదు. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక రాజకీయ వేదికపై త్రివిక్రమ్ పై పవన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
చిత్తూరు జిల్లా విద్యార్థులతో పవన్ సమావేశం అయ్యాడు. ఆ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. విద్యతో జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం అందించని విద్య వృదా విద్యార్థులు ఎవరైనా కూడా ఉన్న జ్ఞానంతో సరి పెట్టుకోకుండా ప్రతి రోజు కూడా ఏదో ఒక విషయంలో జ్ఞానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. నా స్నేహితుడు త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేశాడు. అతడు ఆ రంగంలోనే కాకుండా ఇంకా ఎన్నో రంగాల్లో ప్రావిణ్యం పొందాడు. ప్రతి నిత్యం కూడా త్రివిక్రమ్ ఏదో విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
విద్యార్థులు అంతా కూడా త్రివిక్రమ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. త్రివిక్రమ్ నేను ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా ఆయన జ్ఞానం అపారమైనది ప్రతి విషయంలో కూడా లోతు అధ్యయనం చేయడం ఆయన శైలి అంటూ పవన్ తన స్నేహితుడైన దర్శకుడు త్రివిక్రమ్ గురించి చెప్పి ఆకాశానికి ఎత్తాడు. రాజకీయ వేదిక మీద మొదటి సారి పవన్ కళ్యాణ్ ఇలా త్రివిక్రమ్ గురించి మాట్లాడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.