118 ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘118’ మార్చ్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పాపులర్ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుండి డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.  మొదటి వీకెండ్ కు శివరాత్రి హాలిడే కూడా తోడవడంతో ఆ అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకున్న ఈ సినిమా మొదటి వారంలో  రూ. 7.40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది.  ‘118’ ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలకడగా కలెక్షన్స్ వసూలు చేయగలిగితే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరే అవకాశం ఉంది.  తెలుగు రాష్ట్రాల వరకూ ఈ సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్సే వసూలు చేసినా ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పటివరకూ $100K గ్రాస్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.  ఓవర్సీస్ లో ఈ కలెక్షన్స్ ఫిగర్ ఇక మెరుగయ్యే అవకాశాలు లేవు.    

ప్రపంచవ్యాప్తంగా  ‘118’ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. 

నైజామ్: 2.83 cr 

సీడెడ్: 1.01 cr 

ఉత్తరాంధ్ర: 0.74 cr

కృష్ణ: 0.51 cr 

గుంటూరు: 0.50 cr 

ఈస్ట్ : 0.43 cr 

వెస్ట్: 0.31 cr 

నెల్లూరు: 0.17 cr 

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 6.50 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.60 cr

ఓవర్సీస్: 0.30 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.40 cr