లిరికల్ వీడియో: లవ్వింగు ఫీలింగు

అక్కినేని నాగ చైతన్య సమంతా పెళ్ళయాక మొదటిసారి కలిసి నటిస్తున్న మజిలి వచ్చే నెల 5న రానున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇవాళ ఫస్ట్ ఆడియో సింగల్ రిలీజ్ చేసింది టీం. వన్ బాయ్ వన్ గర్ల్ అనే పల్లవితో సాగే ఈ పాట థీమ్ ఇష్టం లేని పెళ్లి చేసుకునే ఓ అబ్బాయి మనస్తత్వం చుట్టూ తిరుగుతుంది.

అమ్మా నాన్న పెళ్లి చూపులకు తీసుకెళ్ళడం కట్నం పుచ్చుకోవడం ఆ తర్వాత ఫస్ట్ లవ్ ని మనసులోనే చంపేసుకుని కొత్త జీవితానికి స్వాగతం పలకడం ఈ మెసేజ్ నంతా క్యాచీ పదాలతో భాస్కర భట్ల సాహిత్యంతో నింపేయగా గోపి సుందర్ ట్యూన్ క్యాచీగా ఉంది.మరీ కొత్తగా అని చెప్పలేం కాని ఉన్నంతలో యూత్ కి నచ్చేలా మాత్రం దీన్ని కంపోజ్ చేశారు. రేవంత్ గాత్రం బాగుంది.

ట్రెడిషనల్ ఫోక్ బీట్స్ ని మిక్స్ చేస్తూ రిధమిక్ గా సింక్ చేసిన విధానం బాగుంది. పెళ్లి అంటే ఆరడుగుల గోయ్యితో పోల్చడం హీరో బార్ ని పోలిన డాబాలో యువకులతో కలిసి గ్రూప్ డాన్స్ చేస్తూ పాడటం చూస్తే ఉద్దేశం స్పష్టంగా అర్థమైపోతోంది. చైతు మరోసారి ఫెయిల్యూర్ లవ్ తో పాటు బలవంతపు పెళ్లి కాన్సెప్ట్ తో ఏదో కొత్తగా ట్రై చేసినట్టు ఉంది. వచ్చే నెల 5న విడుదల కానున్న మజిలిలో సమంతా చాలా ఎమోషనల్ పాత్ర పోషించినట్టు టాక్.