లేడీస్ డే: స్టార్ల జీవితంలో భార్యలు

మహిళలే మహారాణులు. నేడు (మార్చి 8) మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీల్లో భార్యల పాత్రను ఓమారు తరచి చూస్తే.. పలు ఆసక్తికర సంగతులే వెలుగు చూశాయి. సదరు స్టార్ల కెరీర్ ఆద్యంతం భార్యామణుల ప్రోత్సహం ఎంతో ఉన్నతమైనది. ఎంతో బృహత్తరమైనది. బిజీ ప్రపంచంలో తీవ్రమైన కాంపిటీషన్ లో ఎన్నో ఒత్తిడుల నడుమ స్టార్లు నలిగిపోయే సన్నివేశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ ఒత్తిడిని అధిగమించేందుకు భార్యామణుల `మోరల్ సపోర్ట్` లేకపోతే కుదురుతుందా? అందుకే టాలీవుడ్ టాప్ 5 స్టార్ వైఫ్స్ గురించిన ముచ్చట ఇదీ.భార్య అంటే ఒకప్పుడు వంటింటి కుందేలు అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు అంతా మారింది. కిచెన్ నుంచి ప్రపంచ రాజకీయాల వరకూ ప్రతిదీ చక్కబెట్టేస్తున్నారు. మన స్టార్ వైఫ్స్ ని పరిశీలిస్తే ఎందులోనూ తక్కువ కాదు. వంట చేయగలరు.. హబ్బీ కెరీర్ ని చక్కదిద్దే ప్రణాళికను తయారు చేయగలరు.. ఫ్యామిలీని – పిల్లల్ని సాకగలరు. బయటి ప్రపంచంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజినెస్ వ్యాపకాల్లోనూ తలమునకలుగా ఉంటూ భర్తలైన హీరోల్ని పరిశ్రమలో తిరుగులేని రారాజులుగా నిలబెట్టగలరు అని ప్రూవ్ అవుతోంది. కింగ్ నాగార్జున – అమల – సూపర్ స్టార్ మహేష్ – నమ్రత – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహారెడ్డి – సూర్య – జ్యోతిక – అక్కినేని నాగచైతన్య – సమంత ఈ జంటల నిత్య వ్యాపకాల్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర సంగతులే తెలుస్తాయి. 

అమల తొలి నుంచి గొప్ప సామాజిక కర్త. సంఘ జీవి. బ్లూక్రాస్ అధినేతగా సంఘంలో గొప్ప గౌరవం గుర్తింపు సంపాదించారు. కింగ్ నాగార్జున కెరీర్ ఆద్యంతం అతడిని స్టైలిష్ మ్యాన్ గా తీర్చిదిద్దిన భార్యామణిగా చెబుతారు. నాగ్ ఇంతింతై అన్న చందంగా ఎదిగారంటే ఆ వెనక అమల ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. అసలు నాగార్జున స్టైలింగ్ మార్చేసిందే అమల. హలోబ్రదర్ స్టైల్ తెచ్చింది అమల ఇచ్చిన గైడెన్స్ తో అని అప్పట్లో చెప్పుకున్నారు. జీవితంలో భార్య పాత్ర ఎంత ఉన్నతమైనదో చెప్పేందుకు ఈ ఎగ్జాంపుల్ చాలు. ఇక నాగ్ లైఫ్ లో అమల పోషించిన పాత్రనే మహేష్ విషయంలో నమ్రత పోషించారు. మహేష్ ని సూపర్ స్టార్ ని చేసిన ఘనత నమ్రతదే. మహేష్ వ్యక్తిగత విషయాల నుంచి అతడి స్టైలింగ్ విషయంలో నమ్రత ఇన్వాల్వ్ మెంట్ లేనిదే కుదరదు. కిడ్స్ గౌతమ్ – సితార బాధ్యతల్ని దగ్గరుండి చూసుకుంటారు. ప్రస్తుతం ఏఎంబీ సినిమాస్ బిజినెస్ ఐడియా నమ్రతదే. ఫేజ్ 3 ప్రపంచంలో ఘట్టమనేని హవా వెనక నమ్రత పనితనం ప్రశంసనీయం అని చెబుతారు. ఇక చరణ్ కి ఉపాసన చిన్ననాటి స్నేహితురాలు. చెర్రీ కెరీర్ ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేసిన భార్యామణిగా ఉపాసన గురించి టాక్ ఉంది. ఆ ఇద్దరూ ఫిట్ నెస్ ఫ్రీక్స్. జిమ్ లో రెగ్యులర్ గా కసరత్తులు చేస్తారు. అలాగే ఉపాసన సామాజిక కర్తగా – అపోలో బిజినెస్ ఉమెన్ గా ఉంటూనే చరణ్ కెరీర్ విషయంలోనూ శ్రద్ధ చూపిస్తారు. స్నేహారెడ్డిని పరిశీలిస్తే బన్నిని హ్యాపీ మ్యాన్ గా తీర్చిదిద్దడంలో తన పాత్ర విస్మరించలేనిది. ఈ జంట ఇద్దరు కిడ్స్ కి పేరెంట్. అల్లు ఫ్యామిలీ హ్యాపీ మూవ్ మెంట్స్ వెనక స్నేహా పాత్ర గురించి నిరంతరం చర్చ సాగుతుంది. సూర్య – జ్యోతిక జంటకు ఇద్దరు కిడ్స్. సౌత్ ఇండస్ట్రీలోనే ఐడియల్ జంటగా చెబుతారు. స్టార్ హీరోగా సూర్య ఒత్తిళ్లలో ఉన్నప్పుడు జ్యోతిక సహకారం ఎంతో గొప్పది అని అభిమానులు ముచ్చటించుకుంటారు. అలాగే యువహీరో అక్కినేని నాగచైతన్య లైఫ్ లో సమంత పాత్ర గురించి చెప్పాల్సిన పనేలేదు. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ అన్యోన్య దంపతులుగా వెలిగిపోతున్నారు. చైతన్య తో కలిసి సినిమాల్లో నటిస్తూనే అక్కినేని ఫ్యామిలీ వ్యాపకాల్ని సమంత చక్కదిద్దుతున్నారు. ఇలా ఎందరో స్టార్ వైఫ్స్ లైఫ్ స్టైల్ గురించి అభిమానుల్లో చర్చ సాగుతూనే ఉంటుంది.